దీన స్థితిలో బుల్లితెర న‌టి షగుప్త అలీ.. ట్రీట్‌మెంట్‌కు కూడా డ‌బ్బుల్లేక..!

-

సినీ రంగుల ఇండ‌స్ట్రీ అంటే రంగుల ప్రపంచంతో పాటు అనేక ర‌కాల విషాద గాధ‌లు కూడా ఉంటాయి. ఎందుకంటే స‌క్సెస్ అయితే వ‌చ్చే గుర్తింపు హోదా వేరు. అలాగే ఫెయిల్ అయితే వ‌చ్చే న‌ష్టం వేరే అని చెప్పాలి. ఎంతో మంది అవ‌కాశాలు రాక చివ‌ర‌కు దీన అవ‌స్థ‌లో ఉండ‌టం మ‌నం చూసే ఉంటాం.ఇప్పుడు కూడా అలాంటి న‌టి ఒక‌రు చాలా దీన‌గాథ‌లో ఉన్నారు. బుల్లితెర‌పై సాసురల్ సిమర్ కా సీరియల్‏తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి షగుప్త అలీ(Shagufta Ali). ప్ర‌స్తుతం ఆమె చాలా ఆర్థిక సమస్యలతో కూరుకుపోయింది. పునర్ వివాహ్, వీరా లాంటి ఎన్నో విజ‌య‌వంత‌మైన సీరియ‌ల్ల‌లో న‌టించిన ఈమె ఒక‌ప్పుడు స్టార్ యాక్ట‌ర్‌గా రాణించింది.

షగుప్త అలీ /Shagufta Ali

ప్ర‌స్తుతం ఆమెకు క‌రోనా కార‌ణంగా అవ‌కాశాలు లేక‌, ఎలాంటి ప‌నులు దొర‌క్క కొట్టుమిట్టాడుతోంది. ఆమెకు గ‌త 20ఏళ్లుగా రొమ్ము క్యాన్సర్‏తో చాలా అవ‌స్థ ప‌డుతున్నారు. ఈ రోగానికి సంబంధించి ఇప్ప‌టికే 9 కెమోథెరపీ సెషన్లు కూడా చేయించ‌కున్న‌ప్ప‌టికీ ఆమెకు న‌యం కాలేద‌ని తెలుస్తోంది. గ‌త నాలుగేండ్లుగా త‌న వ‌ద్ద డ‌బ్బుల్లేక చికిత్స కూడా చేయించుకోవ‌ట్లేద‌ని తెలిపింది. షుగ‌ర్‌, కంటిచూపు లాంటి అనారోగ్య సమస్యలు త‌న‌ను వేధిస్తున్నాయ‌ని, ఇప్ప‌టికే ట్రీట్ మెంట్ కోసం కారు, నగలు, ఆస్తులు కూడా పూర్తిగా అమ్మేసానని, త‌న‌ను ఎవ‌రైనా ఆదుకోవాల‌ని కోరుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version