ఇదేం పెళ్లి;శానిటైజర్ పన్నీరు ఇచ్చారు, మాస్కుల దండలు వేసారు…!

-

లాక్ డౌన్ ఏమో గాని పెళ్లి చేసుకునే వాళ్లకు మాత్రం ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు పెరగడంతో ఇప్పుడు లాక్ డౌన్ ని కొనసాగిస్తున్నారు. పెళ్ళిళ్ళు ఇప్పట్లో అయ్యే పరిస్థితి ఎక్కడా కూడా కనపడటం లేదు. తాజాగా ఒక పెళ్లి జరిగిన తీరు చూసి అధికారులు కూడా షాక్ అయ్యారు. వాళ్ళు వాడిన వస్తువులు, మార్చుకున్న దండలు అన్నీ కూడా వింతగానే ఉన్నాయి.

కరోనా కట్టడిలో శానిటైజర్, మాస్క్ లు చాలా కీలకంగా మారాయి. ఇప్పుడు వాటినే పెళ్ళిలో పూర్తిగా వాడారు. యూపీలోని హమీర్‌పూర్‌ పరిధిలోగల చాని బుజుర్గ్ గ్రామంలో నివాసం ఉండే… వీరనారాయణ కుమార్తె ప్రియకు ఖని ఖుర్ద్ గ్రామంలో నివసిస్తున్న కామతా ప్రసాద్ పాండే పెద్ద కుమారుడు శివకాంత్ వివాహం నిశ్చయించారు పెద్దలు. లాక్ డౌన్ ఉన్నా సరే పెళ్లి చెయ్యాలి అనుకున్నారు వాళ్ళు.

ఏప్రిల్ 19 న ముహూర్తం కుదిర్చారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ వివాహం జరిపించారు పెద్దలు. రిసెప్షన్ నిర్వహించే సమయంలో గేటు వద్ద బంధువులకు దండలు వేయడానికి గానూ మాస్కులు వేసారు. వివాహానికి వచ్చిన కొద్దిమందికి శానిటైజర్లు ఇచ్చారు నిర్వాహకులు. అలాగే అక్కడ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వివాహం చేసారు. ఈ పెళ్లి ఇప్పుడు ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news