రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న గ్రామ, వార్డు సభలు రసాభాసగా మారుతున్నాయి. అధికారులు, కాంగ్రెస్ నేతల తీరుపై భగ్గమంటున్నారు. ఓ వైపు మహిళలు, యువత సైతం గ్రామసభలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అర్హులను కాకుండా అనర్హులకు ఎలా ప్రభుత్వ పథకాలు వర్తింప జేస్తారని, తమ పేర్లు కాకుండా అనర్హుల పేర్లను జాబితాలో ఎలా చేరుస్తారంటూ ఫైర్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే ఖమ్మం – కొణిజర్ల మండలం సిద్దిక్ నగర్ గ్రామంలో ప్రజాపాలన సదస్సులో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందటం లేదనే ఆగ్రహంతో టెంట్ కూలగొట్టి దానిని తిరగేసి మరీ గ్రామస్థులు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. అధికారులు చెప్పిన సమాధానాలతో విసిగిపోయిన ప్రజలు ఇలా టెంట్‌ను కింద పడేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
తిక్కరేగి ఖమ్మంలో గ్రామ సభ టెంట్ కూలగొట్టిన గ్రామస్థులు
అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందటం లేదని ఆగ్రహంతో గ్రామ సభలో టెంట్‌ను పడవేసిన గ్రామస్థులు
ఖమ్మం – కొణిజర్ల మండలం సిద్దిక్ నగర్ గ్రామంలో ప్రజా పాలన సదస్సులో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందటం లేదనిఆగ్రహంతో టెంట్‌ను… https://t.co/sVSgIeoCmV pic.twitter.com/I0ZqVUh546
— Telugu Scribe (@TeluguScribe) January 22, 2025