ఆదాయపు పన్ను శాఖ గుడ్ న్యూస్…!

-

దేశంలో కరోనా వైరస్ దెబ్బకు చాలా మంది ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపశమనం ఇచ్చే చర్యలు చేపడుతున్నాయి. తాజాగా ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీఎస్ మినహాయింపుల కోసం ఫైలింగ్ డెడ్‌లైన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి టీడీఎస్ మినహాయింపు కోసం ఫామ్ 15జీ, 15 హెచ్ సబ్మిట్ చేసే,

వ్యక్తులకు టీడీఎస్ ఫైల్ చేయడానికి మూడు నెలలపాటు గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆదాయపు పన్ను శాఖ. ట్యాక్స్ పరిధి కంటే తక్కువ ఆదాయం పొందే వర్గాలు టీడీఎస్‌ను ఫైల్ చెయ్యాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రతీ ఏటా ఏప్రిల్ నెలలో వాళ్ళు చెయ్యాల్సి ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్న నేపధ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో సబ్మిట్ చేసిన ఫామ్ 15జీ, 15 హెచ్‌ల వ్యాలిడిటీ జూన్ 30 వరకు ఉంటుందని,

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో వివరించింది. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే ఆదాయపు పన్ను కట్టే విషయంలో కేంద్రం మూడు నెలల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు అన్ని వ్యాపారాలు కూడా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. చాలా వ్యాపారాలు మూతపడిపోయే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాలకు కూడా ఆదాయం తగ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news