నా మీద పోరాడేందుకు సోమిరెడ్డి సరిపోడు: కాకాని గోవర్ధన్ రెడ్డి

-

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కామెంట్స్ సంచలనంగా మారాయి. సోమిరెడ్డికి రెండో జాబితాలో కూడా టికెట్ రాలేదు టికెట్ రాకపోతే చంద్రబాబును తిట్టాలి. ఆయన మీద బాధపడాలి. కానీ నామీద పోరాడానని సోమిరెడ్డి చెబుతున్నారు అనాన్రు. నా మీద పోరాడేందుకు సోమిరెడ్డి సరిపోడు .ప్రజల కోసం పార్టీ కోసం బతికానని చెబుతున్నారు ప్రజలను ఆయన దోచుకున్నారు. సోమిరెడ్డి పట్ల చంద్రబాబు చాలా ఉదారంగా వ్యవహరించారు అన్నారు.

గత ఎన్నికల్లో ఓటమిపాలైనా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారు. సర్వేపల్లి ప్రజలు సోమిరెడ్డిని వదిలించుకున్నారు కానీ పార్టీ నాలుగు సార్లు అవకాశం ఇచ్చింది. ప్రజలు వదిలించుకున్న కూడా నేతను తాము కూడా వదిలించుకోవాలని టిడిపి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సోమిరెడ్డికి టికెట్ రాకపోతే నామీద బాధపడి బురద చెల్లుతున్నారు. నేనేమీ సోమిరెడ్డికి టికెట్ ఇవ్వలేను కదా నన్ను విమర్శించడం సమంజసం కాదు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version