పెరిగిన సిమెంట్ ధరలు.. నిర్మాణ రంగంపై పడనున్న ప్రభావం!

-

సిమెంట్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ మేరకు ఉత్పత్తి రంగ సంస్థలు నిర్ణయించినట్లు సమాచారం.అల్ట్రాటెక్, ఇండియా సిమెంట్స్, దాల్మియా భారత్, రామ్‌కో, ఏసీసీ, ఇండియా సిమెంట్స్, అంబుజా సిమెంట్, చెట్టినాడ్, ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్, సాగర్ సిమెంట్స్, ఓరియంట్ సిమెంట్ వంటి ప్రధాన సిమెంట్ కంపెనీలు ధరలు పెంచినట్లు ‘ఎన్డీటీవీ ప్రాఫిట్’ వెల్లడించింది. అయితే, పెరిగిన ధరల ప్రభావం ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుపై పడనున్నట్లు తెలుస్తోంది. సవరించిన ధరలు గురువారం నుంచే అమలులోకి రానున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది.

కంపెనీ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు భారీగా పెరిగనున్నాయి. ఏపీ, తెలంగాణలో 50 కేజీల సిమెంట్ బస్తాపై రూ.20 నుంచి 30 మేర ధర పెరిగినట్లు సమాచారం. తమిళనాడులో రూ.10 నుంచి 20కి పెరిగినట్లు తెలుస్తోంది.ముడి సరుకు ధర పెరుగుదల,రవాణా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా సిమెంట్ ఉత్పత్తి సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.ఈ నిర్ణయం నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.ధరల పెంపుతో సిమెంట్ కంపెనీల షేర్ల ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news