హర్యానాలో కాంగ్రెస్‌కు పెరిగిన మైలేజ్..

-

హరియాణా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తలకిందులు అయిన విషయం తెలిసిందే. అన్ని పోల్ సంస్థలు హరియాణాలో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ అనుహ్యంగా బీజేపీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. కాంగ్రెస్ ఓటమిని ఆ పార్టీ సీనియర్లు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మరికొందరైతే తమకు ఈవీఎంల మీద అనుమానం ఉందని బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారు.

హరియాణాలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనా ఇక్కడ బీజేపీ-హస్తం పార్టీ మధ్య తేడా 11 సీట్లు మాత్రమే. ఓటు షేరింగ్‌‌లో రెండు పార్టీలకు 39 శాతం సాధించాయి. అయితే, 2019లో కాంగ్రెస్కు 28.08 ఓటింగ్ శాతం నమోదు కాగా, ఈసారి ఘననీయంగా ఆ పార్టీకి ఆదరణ పెరిగింది. బీజేపీ గత ఎన్నికల్లో 36.49శాతం ఓటు షేరుతో 40 సీట్లు గెలుచుకుంది. జననాయక్ జనతాపార్టీకి 2019లో 14.80 శాతం ఓటు షేరుతో 10 సీట్లలో గెలుపొందగా.. ఈసారి మూడు సీట్లకే పరిమితమైంది.

 

Read more RELATED
Recommended to you

Latest news