IND va SL : టీమిండియాకు షాక్.. లంక సిరీస్‌కు స్టార్ బౌల‌ర్ దూరం

-

రేప‌టి నుంచి టీమిండియా, శ్రీలంక మ‌ధ్య టీ 20 సిరీస్ ప్రారంభం కానుంది. కాగ ఈ సిరీస్ కు ముందు టీమిండియాకు భారీ షాక్ త‌గిలింది. అటు బాల్ తో ఇటు బ్యాట్ తో మ్యాచ్ స్వరుపాన్నే మార్చే స‌త్తా ఉన్న దీప‌క్ చాహార్ ఈ సిరీస్ కు దూరం అయ్యాడు. ఇటీవ‌ల వెస్టిండీస్ తో జ‌రిగిన టీ 20 సిరీస్ లో దీప‌క్ చాహార్ కు గాయం అయింది. గాయం అయినా.. మూడో టీ 20 ని దీప‌క్ చాహార్ ఆడాడు. అయితే ప్ర‌స్తుతం గాయం తీవ్ర‌త పేరిగిన నేప‌థ్యంలో దీప‌క్ చాహ‌ర్.. శ్రీ‌లంక సిరీస్ కు దూరం అయ్యాడు.

కాగ దీప‌క్ చాహ‌ర్ స్థానంలో జ‌ట్టులోకి ఇంకా ఎవ‌రినీ తీసుకోలేదు. కాగ శ్రీ‌లంక, టీమిండియా మ‌ధ్య ఈ నెల 24 న తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 26, 27 తేదీల్లో వ‌రుసగా రెండు, మూడు టీ మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి. దీని త‌ర్వాత మార్చి 4న తొలి టెస్టు మ్యాచ్ జ‌రుగుతుంది. అలాగే మార్చి 12 వ తేదీ నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. కాగ ఇప్ప‌టికే వెస్టిండీస్ ను టీ 20, వ‌న్డే సిరీస్ ల‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news