IND VS ENG :వైజాగ్ చేరుకున్న ఇండియా, ఇంగ్లండ్ జట్లు

-

రెండో టెస్టు కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు విశాఖ చేరుకున్నాయి. విశాఖలోని వై.ఎస్.రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. 2003లో నిర్మితమైన ఈ స్టేడియంలో ఈ టెస్ట్ మ్యాచ్ మూడోది కానుంది. గతంలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లతో ఈ వేదికగా భారత్ తలపడింది.

 

భారత్‌ – ఇంగ్లండ్‌ మధ్య హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో భారత్‌ కి ఘోర పరాభవం ఎదురు అయిన సంగతి తెలిసిందే.5 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడిన ఇండియా జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది.

అయితే తొలి టెస్టులో ఓడిన టీమ్ ఇండియా రెండో టెస్టులో పుంజుకోవాలని భావిస్తోంది. తొలి టెస్టు ఆడిన కేఎల్ రాహుల్, జడేజా రెండో మ్యాచ్ ఆడట్లేదు. అలాగే విరాట్ కోహ్లి, షమీ కూడా లేరు. జట్టులో రోహిత్, అశ్విన్, బుమ్రా తప్ప అనుభవజ్ఞులు లేరు. టీమ్ ఇండియాలో అందరి ఆటగాళ్ల టెస్టు రన్స్.. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ రూట్ చేసిన పరుగుల కంటే తక్కువే. ఇన్ని ప్రతికూలతల మధ్య రోహిత్ సేన ఏం చేస్తుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version