రెండో టీ20లో జింబాబ్వేపై భారత్ 100 పరుగుల భారీ తేడాతో గెలిచింది. 235 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఆ జట్టును టీమ్ ఇండియా బౌలర్లు జింబాబ్వేని 134 పరుగులకే ఆలౌట్ చేశారు. ముకేశ్, అవేశ్ తలో 3, బిష్ణోయ్ 2, సుందర్ ఒక వికెట్ పడగొట్టారు.
ఇక మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాట్స్ మెన్లో యంగ్ ప్లేయర్ అబిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. జింబాబ్వే బౌలర్లను ఉరుకులు పరుగులు పెట్టించాడు. 47 బంతుల్లో 8 సిక్సులు, 7 ఫోర్లు బాది అభిషేక్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. తొలి మ్యాచ్లో ఓడిన కసితో ఉన్న అభిషేక్ వచ్చిన బౌలర్ ని వచ్చినట్లు ఉతికి ఆరేశాడు. అభిషేక్ మెరుపు సెంచరీతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. 234 పరుగులు సాధించింది.అబిషేక్ ఔట్ అయిన తరువాత క్రీజులో ఉన్న రింకు సింగ్ (48), గైక్వాడ్ (77) చెలరేగారు. సిరీస్ తొలి మ్యాచ్లోనే భారత్కు షాకిచ్చిన జింబాబ్వేపై టీమిండియా ఆటగాళ్లు కసి తీర్చుకున్నారు.