ఢిల్లీలో డాక్టర్ల నిరవధిక సమ్మె..కారణం ఇదే!.

-

ఢిల్లీలోని హిందూ రావు మరియు కస్తూర్బా గాంధీ ఆస్పత్రిలోని రెసిడెంట్ వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు..గత మూడు నెలల నుంచి యాజమాన్యాలు జీతాలు చెల్లించకపోవడంతో జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరసన దీక్షకు దిగారు..ఢిల్లీలో కస్తూర్బా గాంధీ ఆసుపత్రి అతిపెద్ద ప్రసూతి కేంద్రాలలో ఒకటి..మేము చాలా మంది నాన్-కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్నామన్నారు రెసిడెంట్ డాక్టర్ డాక్టర్ ఉమా..మూడు నెలల నుంచి మాకు జీతాలు లేకపోవడంతో అప్పులు తీసుకోవలసి వస్తుందని..కరోనా క్లిష్ట సమయంలో మేము వైద్య సేవలు అందిస్తున్నాము..దానికి తగిన వేతనాలు పొందడం మా హక్కు, ”అని రెసిడెంట్ డాక్టర్ డాక్టర్ ఉమా అన్నారు.
గత సంవత్సర కాలం నుంచి జీతాలు సరిగ్గా చెల్లించడం లేదని..జీతాలు లేకుండా ఢిల్లీ వంటి నగరంలో నివశించడం చాలా కష్టంగా ఉందన్నారు డాక్టర్ నేహా సింగ్..మాకు ఒక నెల జీతం వచ్చినప్పటికీ,మాకు ప్రాథమిక ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయని..ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని మేము కోరుకుంటున్నాము అన్నారు డాక్టర్ నేహా సింగ్..హిందూ రావు ఆసుపత్రిలో రెసిడెంట్ డాక్టర్లు సెప్టెంబర్ ఆరంభం నుండి నిరసన వ్యక్తం చేయగా, కస్తూర్బా గాంధీ ఆసుపత్రి వైద్యులు అక్టోబర్ మధ్యలో నిరసన కార్యక్రమాల్లో చేరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version