75వ స్వాతంత్య్ర దినోత్సవ ( 75th Independence Day ) వేడుకలు జరుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త వెబ్ సైట్ indianidc2021.mod.gov.in . ని రివీల్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ ని డిఫెన్స్ సెక్రటరీ డాక్టర్ అజయ్ కుమార్ ఆగస్టు 3వ తేదీన లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ వెబ్సైట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరినీ కూడా కనెక్ట్ చేస్తుంది. అయితే మొబైల్ యాప్ ని కూడా త్వరలో ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు.
న్యూఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకలు అందరికీ చూడడానికి వీలుగా ఈ వెబ్ సైట్ ని రూపొందించారు. అయితే వీఆర్ గ్యాడ్జెట్ లేకుండా కూడా 360 డిగ్రీ ఫార్మాట్ లో చూడొచ్చని చెబుతున్నారు. అదే విధంగా దీనిలో మరికొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. వాటి కోసం చూస్తే.. స్వతంత్ర దినోత్సవ వేడుక తో పాటు.. రేడియో గ్యాలరీ, ఇంటరాక్ట్ ఫిల్టర్లు, ఇ-బుక్స్, 50 years of 1971 victory, స్వతంత్ర ఉద్యమం, యుద్ధాలు, వార్ మెమోరియల్ మొదలైనవి ఉన్నాయి.
ఒకసారి నెటిజెన్లు లాగిన్ అయితే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అదే విధంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, రూట్ మ్యాప్, పార్కింగ్ డీటెయిల్స్ మొదలైనవన్నీ కూడా ఈ ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ప్లాట్ ఫామ్ వెబ్ ఆధారిత RSVP సిస్టంని ఉపయోగించుకొని చేయబడింది.
ప్రతి ఇన్విటేషన్ కి కూడా ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ ని స్కాన్ చేయడానికి మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తే సరిపోతుంది. దీనితో ఆటోమేటిక్ గా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అయితే మొత్తం భారతీయులు అందరు కూడా ఈ వేడుకలో భాగం అవ్వచ్చు. అన్ని వయసు వారు ఈ వేడుకలని చూడచ్చు. ముఖ్యంగా యువత దీనిలో పాల్గొంటే మంచిది. ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు లక్ష్యం ఏమిటంటే..? “culture of togetherness”. అయితే ప్రతీ ఒక్కరు కూడా అంతా ఒకటే అనే భావనతో నడుచుకోవాలి అని రక్షణ కార్యదర్శి కుమార్ అన్నారు.