అవినీతిలో ప్రపంచంలో 93వ స్థానంలో భారత్

-

అవినీతి సూచీలో భారత్‌ ప్రపంచంలోనే 93వ స్థానంలో నిలిచింది. 2022లో 40 పాయింట్లు సాధించిన మన దేశం 2023లో 39 పాయింట్లకే పరిమితమై మరింత దిగజారింది. మొత్తం 180 దేశాల్లో భారత్‌ 93వ స్థానానికి చేరింది. ప్రభుత్వ స్థాయిలో అవినీతి ఏ మేరకు ఉందో నిపుణులు, వ్యాపారవేత్తల అభిప్రాయాలు తీసుకుని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సున్నా నుంచి 100 మధ్య పాయింట్లను కేటాయించి.. సున్నా అయితే అవినీతి ఎక్కువని, 100 అయితే అవినీతి రహితమని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అవినీతి రహిత దేశంగా డెన్మార్క్‌ నిలిచింది. రెండో స్థానంలో  ఫిన్‌లాండ్‌ ఉంది.

ప్రపంచంలో అత్యంత అవినీతిమయమైన దేశంగా సోమాలియా మిగిలింది. భారత్ 93వ స్థానంలో నిలవగా పొరుగున ఉన్న పాకిస్థాన్‌, శ్రీలంకలు వరుసగా 133, 115 ర్యాంకుల్లో నిలిచాయి. ఇక కఠినమైన చట్టాలు అమలు చేసే చైనా 76వ స్థానంలో ఉంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని 71 శాతం దేశాలు అవినీతి సూచీలో 45 కంటే తక్కువ పాయింట్లతో ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news