దేశంలో కొత్తగా 2401 మంది కరోనా పాజిటివ్‌

-

ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేసిన కరోనా రక్కసి తగ్గుముఖం పడుతోంది. మొన్నటి వరకు భారీగా నమోదైన కేసులు ఇప్పడిప్పుడే తగ్గుతూ వస్తున్నాయి. అయితే. దేశంలో కొత్తగా 2401 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,28,828కి చేరాయి. ఇందులో 4,40,73,308 మంది బాధితులు కోలుకోగా, 5,28,895 మంది కరోనాతో మృతిచెందారు. దేశంలో ప్రస్తుతం 26,625 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో ఐదుగురు కరోనాకు బలవగా 2373 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.06 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 219.23 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతుండటం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 9వేల 254 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 78 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 42 కేసులు వచ్చాయి. హన్మకొండ జిల్లాలో 5 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 4 కేసులు, నల్గొండ జిల్లాలో 4 కేసులు, మెదక్ జిల్లాలో 4 కేసులు వెల్లడయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version