భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆర్ధిక పరిస్థితి రీత్యా ఎక్కడికక్కడ లాక్ డౌన్ లు ఎత్తి వేయడంతో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 96,424 కరోనా కేసులు నమోదు కాగా 1174 మంది మృతి చెందారు. ఇక నిన్నటి కేసులతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు 52 లక్షలు దాటినట్టు చెబుతున్నారు. ఇక నిన్నటి మరణాలతో మరణాలు 84 వేలు దాటినట్టు చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా 52,14,678 కరోన కేసులు నమోదు కాగా ఇప్పటిదాకా 84,372 మంది మృతి చెందారు. ఇక ప్రస్తుతం దేశంలో 10,17,754 యాక్టీవ్ కేసులు ఉండగా 41,12,551 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో 87,472 మంది కరోన నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో 78.86గా కరోనా రికవరీ రేటు ఉండగా మరణాల రేటు 1.62 గా ఉన్నది.