భారత్ లో కరోనా కేసులు కాస్త తగ్గాయి. ఇక తాజాగా నమోదయిన కరోనా కేసులతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66 లక్షల 23 వేలు దాటింది. గడచిన 24 గంటలలో, అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 74,442 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 903 మంది మృతి చెందారు. అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 76,737గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,23,816కి చేరింది. నిన్నటి కేసులతో దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 9,34,427కు చేరాయి.
కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 55,86,703కు చేరింది. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,02,685కు చేరింది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 84.34 శాతంగా ఉంది. ఇక దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 14.11 శాతంగా ఉన్నాయి. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.55 శాతానికి మరణాల రేటు తగ్గింది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 9,89,860 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు 7,99,82,394 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేసినట్టు అయింది.