ఇండియా కరోనా అప్డేట్.. వరుసగా ఆరో రోజూ రికార్డే !

-

భారత్ లో కరోనా విజృంభిస్తూనే ఉంది. మొదట్లో ప్రభుత్వాలు అన్నీ లాక్ డౌన్ లో ఉండడంతో కరోనా కేసులు కంట్రోల్ లోనే ఉండేవి. కానీ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా అన్నీ వదిలేయడంతో రోజుకు లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే కొద్దిరోజులుగా తొంభై వేలకు దగ్గరలో నమోదవుతున్న కేసులు ఈరోజు భారీగా తగ్గాయి. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 57 లక్షలు దాటింది. గడచిన 24 గంటలలో 86,508 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 1,129 మంది మృతి చెందారు.

అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 87,374గా ఉంది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 57,32,519కు చేరగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా 9,66,382 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 46,74,988కు చేరింది. అలానే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 91,149కు చేరింది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 81.55 శాతానికి చేరింది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 16.86 శాతంగా ఉన్నాయి. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.59 శాతానికి తగ్గింది. ఇక కరోనా వైరస్ నుండి 87,374 మంది నిన్న ఒక్క రోజే కోలుకున్నారు. అంటే నమోదయిన కేసుల కంటే రికవరీలే ఎక్కువ అన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news