ఇండియా లో కరోనా మహమ్మారి మూడో వేవ్ పూర్తిగా తగ్గి పోయింది. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 5476 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,62,953 కు చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 59,442 కు చేరింది.
ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.92 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 158 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,15,036 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9754 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,23,88,475 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,78,83,79,249 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 26,19,778 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.
COVID19 | India records 5,476 new cases, 158 deaths and 9,754 recoveries in the last 24 hours; Active cases stand at 59,442 pic.twitter.com/xXECapxU4A
— ANI (@ANI) March 6, 2022