ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కనీసం ఒక్క లీటర్ పెట్రోల్ కూడా కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించే స్థితిలో ఉన్నాయి వాటి రేట్లు. సగటు మధ్య తరగతి కుటుంబాన్ని ప్రభావితం చేసే స్థాయిలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఉన్నాయి. దీంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వీటికి ఆల్టర్‌నేట్ కావాలనే డిమాండ్ పెరుగుతోంది. లేదంటో రానున్న రోజుల్లో వీటిని కొనలేక ఇబ్బందులు పడే స్థితి వస్తుంది.
అయితే ఇప్పుడు మన ఇండియా చేసిన ఓ ప్రయోగం సంచలనం రేపుతోంది. ఈ ప్రయోగం ఏంటో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు ప్రతి ఒక్కరూ. మనం అనవసరమని పాడే చికెన్ వ్యర్థాలతో చాలా రకాలుగా ప్రయోగాలు చేసి బయో డీజిల్‌ను ఉత్పత్తి చేశాడు కేరళకు చెందిన వ్యక్తి. దీంతో అంతా షాక్ అవుతున్నారు.
మన పక్కనే ఉండే కేరళ రాష్ట్రానికి చెందిన పశువుల డాక్టర్ అయిన జాన్ అబ్రహం ఎన్నో రకాల ప్రయోగాల తర్వాత ఈ బయో డీజిల్‌ను కనిపెట్టారు. వాస్తవానికి ఆయన 2014లోనే ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత బయో డీజిల్‌ను కనిపెట్టినా దానిపై ఎన్నో పరీక్షలు నిర్వహించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పేటెంట్లు జారీ చేసింది. అయితే ఈ డీజిల్ వాడితే ఎలాంటి వాతావరణ ప్రభావాలు కూడా ఉండవంట. వంద కేజీల చికెన్ వ్యర్థాల నుంచి ఒక్క లీటర్ డీజిల్ వస్తుందని ఆయన తెలిపారు. అంతే కాదు ఒక్క లీటరుకు కనీసం రూ.59 వరకు అమ్మవచ్చని అబ్రహం చెప్పారు.