మనదేశంలో పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. వీటితో పాటు… వంట నూనె ధరలు భారీగా పెంచేసింది కేంద్ర ప్రభుత్వం. 8 నెలల క్రితం 90 రూపాయలు ఉన్న వంట నూనె ప్యాకెట్.. ఇప్పుడు 180 రూపాయలు దాటేసింది. దీంతో సామాన్య ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సోయాబీన్, సన్ ఫ్లవర్, ముడి పామ్ ఆయిల్ పై బేసిక్ కస్టమ్స్ సుంకo రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. మార్చి 2022 వరకు వీటిపై విధిస్తున్న అగ్రి సెస్ కూడా తొలగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో వంట నూనె ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు అక్టోబర్ 14 నుంచి మార్చి 31, 2022 వరకు అమల్లోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దసరా పండుగ సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.