కాశ్మీర్ లో ఎన్ఐఎ సోదాలు… 5గురు టెర్రరిస్టుల అరెస్ట్

-

కాశ్మీర్లో వరస ఉగ్రదాడులతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. గత మూడు రోజుల్లో 8 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఎ) సోదాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దుల్లోని కుల్గాం, బారాముల్లా, పూంచ్ ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత వారం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా జరిగిన సోదాల్లో 5 ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి జీహాదీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరందరికి లష్కర్ ఏ తోయిబా, జైష్ ఏ మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. వీరితో పాటు ఇటీవల సిక్కు, హిందు మైనారిటీలపై జరిగిన దాడుల్లో ఎవరెవరికి ప్రమేయం ఉందనే వివరాలను సేకరిస్తున్నారు. దాదాపుగా 500 మందికి పైగా ఉగ్రవాద సానుభూతిపరులు టెర్రరిస్టులకు సహాయపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆప్గన్ ను తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత నుంచి కాశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగాయి. వివిధ రకాల ఉగ్రవాద సంస్థలు తమ నెట్వర్క్ ను బలోపేతం చేసుకునే పనిలో ఉన్నాయి. మరోవైపు భద్రతా బలగాలు సరిహద్దు వెంబడి నిఘాను పెంచాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఎన్ కౌంటర్లు పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news