రిజర్వ్ బ్యాంక్ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకు వచ్చింది. దీనిలో భాగంగా భారత దేశం సొంత డిజిటల్ కరెన్సీని త్వరలో తీసుకురానుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి దేశంలో డిజిటల్ రూపీ ట్రయల్స్ ప్రారంభిస్తామని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు (సీబీడీసీ) గా పేర్కొనే ఈ ప్రతిపాదిత డిజిటల్ కరెన్సీ ఆన్‌లైన్ లో చట్టబద్దంగా చెల్లుబాటు అవుతుందని ఆయన వెల్లడించారు. అయితే ఇప్పుడున్న కరెన్సీనోట్లు, నాణేలకు ఆన్‌లైన్ రూపంగా డిజిటల్ రూపీ ఉంటుందని చెప్పారు.
డిజిటల్ కరెన్సీ అనేది మన దేశంలో పూర్తిగా కొత్త సాధనం అన్నారు. అందుకనే రిజర్వ్‌బ్యాంక్ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఇది ఇలా ఉంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకున్న తర్వాతే వడ్డీ రేట్ల పెంపుపై ఆలోచిస్తామన్నారు. కరోనా తర్వాత దేశ ఆర్థిక స్థితి పూర్తిగా మారిందని చెప్పారు. డిసెంబర్ కల్లా డిజిటల్ కరెన్సీ ట్రయల్స్ మొదలు పెడతామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు.
ఈ డిజిటల్ కరెన్సీలో కేంద్రీకృత లెడ్జర్ విధానాన్ని అనుసరించాలా లేక బహుళ భాగస్వాములను కలిగిన డిజిటల్ డేటాబేస్‌ను నిర్వహించాలా అనే దానిపై వర్క్ చేస్తున్నట్టు తెలిపారు. క్రిప్టో మీద ఆసక్తి తగ్గుతుండడం వలన యూకే, యూరప్, చైనాలు డిజిటల్ కరెన్సీలను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రజలకు బ్యాగ్ నాణేల్ని పంపిణీ చేస్తే బ్యాంకులకు రూ.65 ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు శుక్రవారం ఆర్బీఐ తెలిపింది. ఇప్పటివరకూ ఈ ప్రోత్సాహకం రూ.25గా ఉంది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నాణేలు పంపిణీచేస్తే బ్యాగ్‌కు అదనంగా రూ.10 చెల్లించనున్నట్లు కేంద్ర బ్యాంక్ తెలిపింది.