పీకల్లోతు కష్టాల్లో రోహిత్ సేన.. పేకమేడలా కూలిపోయిన ఇండియా !

0
160

శ్రీలంక మరియు ఇండియాల మధ్యన కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ శ్రమ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ వరుసగా ఈ ఆసియ కప్ లో రెండవ అర్ద సెంచరీ పూర్తి చేసుకోగా, ఆ తర్వాత ఇన్నింగ్స్ ను భారీ స్కోర్ దిశగా నడిపించడంలో ఫెయిల్ అయ్యాడు. మొదటగా గిల్ (19) , ఆ తర్వాత రోహిత్ (53), కోహ్లీ (3) లు వరుసగా వికెట్లు కోల్పోయారు. అప్పుడే రాహుల్ మరియు ఇషాన్ కిషన్ లు కాసేపు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.. వీరిద్దరూ నాలుగవ వికెట్ కు 63 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. రాహుల్ 39 పరుగుల వద్ద ఉండగా దునిత్ బౌలింగ్ లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఇషాన్ కిషన్ సైతం 33 పరుగుల వద్ద ఉండగా అసలంక బౌలింగ్ లో క్యాచ్ గా అవుట్ అయ్యాడు..

ఇక వెంటనే పాండ్య మరియు జడేజాలు అవుట్ అవడంతో ఒక్కసారిగా ఇండియా 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్పో పడింది. మరి ఈ పరిస్థితుల్లో ఇండియా కనీసం పరుగులు అయినా చేస్తుందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.