చందమామ రావే… జాబిల్లి రావే.. కొండెక్కి రావే.. గోగు పూలు తేవే.. అని సిని కవి ఏనాడో రాసాడు. అదే విధంగా అమ్మ అన్నం తినిపిస్తూ మారం చేసే చిన్నారికి జాబిల్లిని చూపుకుంటూ అగో బూచోడు ఒస్తున్నాడు… బూచోడు బువ్వ తినిపోతాడు… తిను తిను అంటూ గారాబం చేస్తూనే మరోవైపు బెదిరిస్తూ పెరుగన్నం తినిపిస్తుంది. ఇప్పుడు మన పరిస్థితి అలాగే ఉంది.. జాబిల్లి ఇప్పుడు మనకోక బూచోడు అయ్యాడు. మనం పంపుతున్న శాటిలైట్లను మింగేస్తున్నాడు.. కాని మనకు మాత్రం అందడం లేదు.. అందుకుందామని విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. నేను మీకు అందను గాక అందను అంటూ మనతో దోబూచులాడుతున్నాడు.. నల్లని మబ్బుల చాటున దాక్కుంటూ మనకు మసిపూసి మాయమవుతున్నాడు.. మనకు ఇప్పుడు చందమామ అందకుండా పోతున్నాడనే వాస్తవం జీర్ణించుకోలేక పోతున్నారు భారతీయులు.
ఇప్పుడు చంద్రయాన్ 2 తో మనకు జాబిల్లి అందినట్లే అంది… అంది అందకుండా పోతుండటంతో యావత్ భారతావని ఆందోళనలో పడింది. ఇంతకు చంద్రయాన్ 2 కూడా ఎందుకు చంద్రయాన్ 1లాగే అయిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు చందమామను అందుకోవాలని ఎప్పుడు ప్రయత్నించారు.. చంద్రయాన్ 1 నుంచి చంద్రయాన్ 2 వరకు జరిగిన ఎందుకు చందమామను అందుకోలేక పోతున్నామో.. ఓసారి చూద్దాం..
చంద్రయాన్ 1ను ఇస్రో శాస్త్రవేత్తలు సొంత పరిజ్ఞానంతో చందమామను అందుకోవాలని అహర్నిశలు పనిచేసి శాటిలైట్‌కు రూపకల్పన చేశారు. సుమారు 386 కోట్ల వ్యయంతో ఈ చంద్రయాన్ 1ను రూపొందించారు శాస్త్రవేత్తలు. 1380 కిలోల శాటిలైట్ నుంచి 675 కిలోల ఆర్బిట్‌తో తయారుచేసిన చంద్రయాన్ 1ను శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పెస్ సెంటర్ నుంచి అక్టోబర్ 22, 2008న తెల్లవార జామున 00.52గంటలకు ప్రయోగించారు. విజయవంతంగా ప్రయోగించారు సాంకేతిక లోపంతో అది పనిచేయలేదు. అలా చంద్రయాన్ 1 ప్రయోగం విఫలం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఎలాగైనా చందమామను అందిపుచ్చుకోవాలని సంకల్పించారు.
అదే సంకల్ప బలంతో చంద్రయాన్ 2కు శ్రీకారం చుట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పెస్ సెంటర్ నుంచి జూలై 22న మద్యాహ్నం 2.43 గంటలకు విజయవంతంగా ప్రయోగించింది. మూడు దశలు దాటుకుని చంద్రునికి అతి సమీపంలోకి చేరుకున్న విక్రమ్ ల్యాండర్ 2.1కి.మీ దూరంలో ఇస్రోతో కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోవడంతో శాస్త్రవేత్తలు నిరాశలో మునిగిపోయారు. సెప్టెంబర్ 7, 2019న తెల్లవార జామున 1.54గంటలకు విక్రమ్ ల్యాండర్ నుంచి కమ్యూనికేషన్ తెగిపోయింది. చందమామపై ఉన్నవాతావరణం కారణంగానే చంద్రయాన్ 2 అనుకున్న మేరకు విజయవంతం కాలేకపోయిందనే అభిప్రాయంలో శాస్త్రవేత్తలు ఉన్నారు.