చందమామను అందుకోవాలనే కలకు భారత్ కేవలం 2.1 కిలో మీటర్ల దూరంలో ఆగిపోయింది. గతం పునరావృతం అయింది. కేవలం సాంకేతిక సమస్య తలెత్తడంతో ఏర్పడిన ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు చంద్రయాన్ 2 అన్ని దశలను దాటుకుని చివరి మజిలిలో ఎందుకు సాంకేతిక సమస్య తలెత్తిందో కానీ, శాస్త్రవేత్తలు సకల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చంద్రయాన్ 2 సాంకేతిక సమస్యతో విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. విక్రమ్ ల్యాండర్ నుంచి ఏమైనా సంబంధాలు అందితే సాంకేతిక సమస్యలను సరిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించాడు..
చందమామను అందుకోవాలనే కోరిక భారత్‌కు చిరకాలమైనది. ఇప్పటికే చంద్రయాన్ 1ని ప్రయోగించిన భారత్ కొన్నికారణాలతో అది విఫలం అయ్యింది. ఇప్పుడు చంద్రయాన్ 2 ద్వారానైనా చందమామను అందుకోవాలని తీవ్రమైన కృషి చేశారు శాస్త్రవేత్తలు. కానీ అంతరిక్షంలో జరిగే పెనుమార్పులు, అక్కడి వాతావరణంకు విక్రమ్ ల్యాండర్‌కు సరిచేసిన వాతావరణం సరిపడక పోవడంతో ఇలా జరిగి ఉంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు.
విక్రమ్ ల్యాండర్ 1 గంట నుంచి 2 గంటల నడుమ చంద్రుడి దక్షిణ ధ్రువంపై 70.9 డిగ్రీల దక్షిణ, 22.7 డిగ్రీల తూర్పు అక్షాంశంలో మాంజీన్‌స-సి, సీంపేలియ్‌స-ఎన్ అనే రెండు చంద్ర బిలాల మధ్య ఎగుడుదిగుళ్లు లేని, సమతులంగా ఉండే స్థలాన్ని ఆర్బిటర్‌కు అమర్చిన అర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా ద్వారా అన్వేషిస్తారు. అక్కడ విక్రమ్ దిగేందుకు అనువైన స్థలం లభ్యంకాకపోతే 67.7 డిగ్రీల దక్షిణ, 18.4 డిగ్రీల పడమరగా ఉన్న ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇస్రో సైంటిస్టులు సరిచేసే అవకాశం ఉంది. అయితే ముందుగా శాస్త్రవేత్తలు అనుకున్నది అనుకున్నట్లు జరుగకపోవడంతో చంద్రుడికి 2.1కి.మీ దూరంలో ఇస్రోకు విక్రమ్ ల్యాండర్‌కు సంబంధాలు తెగిపోయాయి.
ఇప్పటికి సాంకేతిక సమస్యలతో కమ్యూనికేషన్ అందకపోవడంతో శాస్త్రవేత్తలు ఆందోళనలో ఉన్నారు. చంద్రయాన్ 2 ప్రయోగంను ప్రత్యక్షంగా వీకించేందుకు బెంగుళూరుకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ శాస్త్రవేత్తలను ఓదార్చే ప్రయత్నం చేశారు. జీవితంలో జయాపజయాలు సహజమేనని, మీరు దేశానికి చేస్తున్న సేవలు ది బెస్ట్.. దేశం గర్వపడేలా చేశారు.. దేశం మీవెంటే ఉంటుంది.. ఇస్రో శాస్త్రవేత్తలను చూసి దేశం గర్వపడుతోంది. ఇక మీరు అదైర్య పడవద్దని మీ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలని మోడీ శాస్త్రవేత్తలకు సూచించాడు. శాస్త్రవేత్తలతో పాటుగా మోడీ 9, 10వ తరగతి విద్యార్థులతో కలిసి వీక్షించిన మోడీ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కాగా ప్రధాని నరేంద్రమోడీ 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు..