భారత ప్రధాని మోదీపై , లక్షద్వీప్ పరిసరాలపై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో ఆ దేశ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఆయా మంత్రులపై వేటు వేసిన మాల్దీవుల ప్రభుత్వం .. ఇండియా తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు త్వరలోనే ఇండియా పర్యటనకు రానున్నట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
ప్రస్తుతం మాల్దీవుల అధికారులు మహమ్మద్ ముయిజ్జు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటివారంలో ఖరారు చేస్తున్నట్లు సమాచారం. అయితే, తాజా విభేదాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదని మాల్దీవుల ప్రభుత్వంవెల్లడించాయి. గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగిన కాప్ 28 పర్యావరణ సదస్సులో ప్రధాని మోడి తో ముయిజ్జు భేటీ సమయంలోనే ఆయన డిల్లీ పర్యటనపై చర్చ జరిగినట్లు సమాచారం.ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నా ముయిజ్జు బీజింగ్ చేపట్టిన బీఆస్ఐ ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించారు. ముయిజ్జుకు చైనాకు అనుకూలమైన వ్యక్తిగా పేరుంది. ఇక, ఇండియా తో విభేదాల నేపథ్యంలో స్వదేశంలో మహమ్మద్ ముయిజ్జు పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.