నాలుగేళ్ల కుమారుడి దారుణ హత్య.. మహిళా సీఈవో గురించి సంచలన విషయాలు వెలుగులోకి..!

-

బెంగళూరు స్టార్టప్ కంపెనీ మహిళా సీఈవో గోవాలోని ఓ హోటల్‌లో తన 4 ఏళ్ల కొడుకును హత్య చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని ట్యాక్సీలో బెంగళూరు వెళ్లింది. గోవా పోలీసుల సమాచారం మేరకు కర్ణాటక పోలీసులు మహిళా సీఈవోని అదుపులోకి తీసుకున్నారు. ఆమె కుమారుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మహిళను 39 ఏళ్ల సుచనా సేథ్‌గా గుర్తించారు. ఆమె మైండ్‌ఫుల్ AI ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకురాలు, CEO కూడా. జనవరి 6న తన కుమారుడితో కలిసి గోవాలోని సోల్ బన్యన్ గ్రాండే హోటల్‌కు వెళ్లింది. జనవరి 8 హోటల్ నుంచి చెక్ అవుట్ చేశారు. భర్తతో విభేదాల కారణంగా ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుచనా సేథ్‌ తన భర్తతో-బిడ్డ కలవకుండా నిరోధించేందుకే ఈ దారుణమైన చర్యకు పాల్పడింది. ఈ జంట 2010లో వివాహం చేసుకున్నారు. వారి కుమారుడు 2019లో జన్మించాడు. వివాదాల కారణంగా 2020లో విడాకుల కోసం దాఖలు చేశారు. ఆదివారాల్లో తన బిడ్డను కలిసేందుకు తండ్రికి కోర్టు అనుమతినిచ్చిందని గోవా డీజీపీ జష్‌పాల్ సింగ్ ధృవీకరించారు.

తన భర్త తమ కొడుకును చూడకుండా ఆపాలనే ఆలోచనతోనే నిందితురాలు తన బిడ్డతో కలిసి గోవా పర్యటనకు ప్లాన్ చేసింది. షెడ్యూల్‌కు ముందు నార్త్ గోవాలోని హోటల్ గదిలో చిన్నారిని హత్య చేసింది. మహిళ తన కుమారుడితో కలిసి చెక్‌ ఇన్‌ అయ్యింది. చెక్‌ అవుట్ మాత్రం ఒంటరిగా వెళ్లిపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version