క‌రోనా ఎఫెక్ట్ : ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ నుంచి భార‌త్ అవుట్

-

ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ లో భార‌త్ హాకీ మ‌హిళ‌ల‌ జ‌ట్టు విజ‌యాల కు క‌రోనా వైర‌స్ అడ్డు వ‌చ్చింది. క‌రోనా వైర‌స్ కారణం గా ఏకం గా టోర్నీ నుంచే భార‌త్ త‌ప్పుకుంది. కాగ హీకి ఇండియా జ‌ట్టు లో ఇటీవ‌ల కరోనా వైర‌స్ సోకింది. దీంతో ద‌క్షిణ కొరియా తో జ‌ర‌గవ‌ల్సిన మ్యాచ్ ర‌ద్దు అయింది. అంతే కాకుండా కరోనా వైర‌స్ కార‌ణం గా ఈ మెగా టోర్నీ నుంచి భార‌త్ ను తొల‌గిస్తున్నట్టు ఆసియా హాకీ స‌మాఖ్య ప్ర‌క‌టించింది.

అయితే ఈ ఏడాది మ‌హిళ‌ల హాకీ ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫి ద‌క్షిణ కొరియా లో నిర్వ‌హిస్తున్నారు. అయితే ఈ టోర్నీ లో భాగం గా ద‌క్షిణ కొరియా కు వ‌చ్చిన భార‌త్ జ‌ట్టు లో ఒక ప్లేయ‌ర్ కు కరోనా వైర‌స్ సోకింది. దీంతో ద‌క్షిణ కొరియా తో జ‌ర‌గాల్సిన మ్యాచ్ ర‌ద్దు అయింది. అలాగే క‌రోనా వైర‌స్ వ్యాప్తి ని దృష్టి లో ఉంచుకుని ఈ టోర్నీ మొత్తం నుంచి భార‌త జ‌ట్టు త‌ప్పించారు. అయితే భార‌త జ‌ట్టు లో క‌రోనా కేసు వెలుగు చూడ‌టం తో భార‌త్.. మ‌లేసియా టోర్నీ నుంచి కూడా వైదొల‌గింది.

Read more RELATED
Recommended to you

Latest news