ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్ భయాందోళనలు నెలకొన్న సమయంలో దేశంలో వైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 8,744 కొత్త కేసులు నమోదైట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలింది. వైరస్ కారణంగా 624 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటివరకు కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 4,68,554కు చేరుకున్నది. ప్రస్తుత దేశంలో 1,05,961 యాక్టివ్ కేసులు ఉండగా, దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 543 రోజుల ముందు పరిస్థితికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.80శాతంగా ఉన్నది.
హైదరాబాద్ శివారులో మహేంద్ర యూనివర్సిటీ క్యాంపస్ అధికారులు మూసివేశారు. గత 15 రోజులలో 30 మందికి వైరస్ బారిన పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాలేజీ యాజమాన్యం తెలిపింది. మొత్తం 25 మంది విద్యార్థులు, ఐదుగురు సిబ్బంది కరోనా బారిన పడ్డారని మల్కాజ్‌గిరి డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ చెప్పారు.