టీమిండియా సౌతాఫ్రికా టూర్ లోనే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు టెస్టు మ్యాచ్ సిరీస్ ఈ టూర్ లో జరిగింది. నేటి నుంచి మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. అందులో భాగంగా నేడు సౌత్ ఆఫ్రికాతో కెఎల్ రాహుల్ నాయకత్వం మొదటి వన్డే మ్యాచ్ ఆడనుంది. ఇప్పటి కే టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా.. వన్డే సిరీస్ ను ఎలాగైనా సాధించాలనే సంకల్పంతో బరిలోకి దిగుతుంది. రోహిత్ శర్మ అందుబాటులో లేక పోవడంతో కెప్టెన్ గా కెఎల్ రాహుల్ వ్యవహరిస్తున్నాడు.
అలాగే మొదటి మ్యాచ్ లో చాలా రోజుల పాటు టీమిండియాకు దూరంగా ఉంటున్న శిఖర్ ధావన్ తో పాటు చాహల్ కూడా ఉంటారని కెప్టెన్ రాహుల్ ఇప్పటికే ప్రకటించాడు. అలాగే ఆరో బౌలర్ గా వెంకటేశ్ అయ్యార్ కూడా అందుబాటు ఉంటాడని రాహుల్ తెలిపాడు. దీంతో యువ సంచలనం వెంకటేశ అయ్యార్ అంతర్జాతీ వన్డే మ్యాచ్ కు అరంగేట్రం చేసినట్టే అవుతుంది. అయితే నేడు జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ బోలాండ్ పార్క్ లో నిర్వహిస్తున్నారు.
అయితే బోలాండ్ పార్క్ స్పిన్ కు అనుకూలిస్తుంది. దీంతో బౌలింగ్ విభాగంలో అశ్విన్ చాహల్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కాగ ఈ వన్డే మ్యాచ్ లో ఓపెనర్లుగా శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ కలిసి బ్యాటింగ్ చేయనున్నారు. అయితే మొదటి వన్డేను నెగ్గి సిరీస్ పోరు లో ఒక అడుగు ముందు ఉండాలని టీమిండియా సన్నాహాకాలు చేస్తుంది.