కాన్పూర్‌లో న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు భారత్‌పై చేయి సాధించింది. టీమిండియా స్పిన్నర్లు విజృంభించి న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఒకే రోజు ముగ్గురు స్పిన్నర్లు కలిసి తొమ్మిది వికెట్లు తీయడంతో 296 పరుగులకే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
న్యూజిలాండ్ ఓపెనర్లు రాణించడంతో రెండో రోజు వికెట్ నష్టపోకుండానే ఇన్నింగ్స్ ముగిసింది. లాథమ్, విల్ యంగ్ సెంచరీకి చేసేలా కనిపించారు. అయితే, లాథమ్(95)ను అక్సర్ పెవీలియన్‌కు పంపగా, విల్ యంగ్(89)ను అశ్విన్ ఔట్ చేశాడు. వీరికితోడు రవీంద్ర జడేజా కూడా రాణించడంతో న్యూజిలాండ్ పెద్దగా స్కోర్ చేయలేకపోయారు. 296 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యారు.
అక్సర్ పటేల్ ఐదు, అశ్విన్ మూడు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీసుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్‌కు మాత్రమే వికెట్ లభించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. శుభ్‌మన్ గిల్ (4) పరుగులకే జెమిసన్ బౌలింగ్‌లో వెనుతిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 63 పరుగుల లీడ్‌లో ఉన్నది.