రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే దేశాల్లో భారత్ టాప్ లో ఉందన్నారు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జెనీవాలోని అంతర్జాతీయ రోడ్డు సమాఖ్య విడుదల చేసిన వరల్డ్ రోడ్డు స్టాటిస్టిక్స్(WRS) 2018 గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాల లో గాయపడుతున్న వారి సంఖ్యలో భారత్ మూడో స్థానంలో ఉందని ఆయన రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
2020 లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారిలో 18 నుంచి 45 ఏళ్ల లోపు వారే 70 శాతం ఉన్నట్లు తెలిపారు.ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ మొత్తం 22 గ్రీన్ ఫీల్డ్ హైవేలు రూ. 1.63,350 కోట్లతో 2,485 కిలోమీటర్ల పొడవుతో 5 ఎక్స్ ప్రెస్ వేలు ఉన్నాయని చెప్పారు. రూ. 1,92,876 కోట్లతో 5,816 కి.మి పొడవుతో 17 యాక్సెస్ కంట్రోల్ హైవేలు ఉన్నాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భారత్ పరియోజన తొలి దశ కింద ఆంధ్రప్రదేశ్ లో 5 గ్రీన్ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్టులు చేపట్టామన్నారు నితిన్ గడ్కరీ.