దిల్లీ వేదికగా టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఒక పరుగు ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. టీమ్ ఇండియా కన్నా 62 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ట్రావిస్ 39, లబుషేన్ 16 క్రీజులో ఉన్నారు. జడేజా ఒక వికెట్ పడగొట్టాడు.
ఓవర్‌నైట్ 21/0 స్కోరుతో రెండో రోజు తమ తొలి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన టీమ్‌ఇండియా ఆసీస్ స్పిన్నర్ల ధాటికి 262 పరుగులకు ఆలౌటైంది. భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (74) అర్ధశతకం సాధించగా.. విరాట్ కోహ్లీ (44), అశ్విన్ (37), రోహిత్ శర్మ 32, రవీంద్ర జడేజా (26) ఫర్వాలేదనిపించారు. నాథన్ లైయన్ 5, కుహ్నెమన్ 2, మర్ఫీ 2 వికెట్లు తీశారు.
అంతకుముందు ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ ఆధిక్యం 62 పరుగులకు చేరింది.