రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేలా భారత్ తయారు కానుంది : కిషన్‌ రెడ్డి

-

అంకితభావంతో పని చేసి దేశాభివృద్ధికి యువత తోడ్పడాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ లోని రైల్ కళారంగ్ లో ఈరోజు జరిగిన రోజ్ గార్ మేళాలో కేంద్ర మంత్రి పాల్గొని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియమితులైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వేగంగా,పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నియామక ప్రక్రియ జరిగేలా చూడడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకంగా ఉంటుంది అని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. దీనిని గుర్తించి యువత విధులు చిత్తశుద్ధితో నిర్వర్తించడానికి కృషి చేయాలని ఆయన సూచించారు.

యువత మేధస్సు ద్వారా రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేలా భారత్ తయారు కానుందని ఆశాభావం వ్యక్తంచేశారు. 22 అక్టోబర్ 2022న దీపావళి కానుకగా ‘రోజ్ గార్ మేళా’ను ప్రధానమంత్రి ప్రారంభించారని ఆయన తెలిపారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా కోటి 25 లక్షల మందికి స్కిల్స్ అందించినట్టు తెలిపారు. ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలోనూ కోట్ల ఉద్యోగాలు సిద్ధమవుతున్నాయన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version