ప్రస్తుతం వరుణుడు తెలంగాణ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలపై తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఊహించని వర్షాల కారణంగా ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహరాష్ట్రలో వరదలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు వరదల వలన రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది మరణించారు మరియు తొమ్మిది జాడ తెలియడం లేదు. ఇల్లు, వాహనాలు అన్నీ వరదలలో కొట్టుకుని పోయే పరిస్థితి అని చెప్పాలి. ఇంకా వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో కొన్ని జిల్లాలకు ప్రభుత్వ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కాగా మహారాష్ట్ర లోని థానే, రాయఘడ్, పూణే, పాల్గర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ను ప్రకటించారు, అదే విధంగా ముంబై, రత్నగిరి, కొల్హాపూర్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను ప్రకటించారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారాన్ని అందిస్తూనే ఉన్నారు.
వరుణుడి ప్రతాపం: వరదల బీభత్సంలో మహారాష్ట్ర … ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ !
-