Indian Army లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే..!

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ Indian Army ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈరోజు అంటే జూలై 20న ప్రారంభమైంది.

Indian Army

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయిన వాళ్లు అప్లై చెయ్యచ్చు. వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ పరీక్షలు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 19 చివరి తేదీ. హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, పూణె, కోల్‌కతా, డార్జిలింగ్, గువాహతి, దిమాపూర్, చండీగఢ్, జలంధర్, షిమ్లా, ఢిల్లీ, అంబాలా, హిసర్, లక్నో, అలాహాబాద్, ఆగ్రా, భువనేశ్వర్, డెహ్రడూన్, ఉదంపూర్, శ్రీనగర్, నగ్రోటా లో పరీక్ష రాయచ్చు.

దరఖాస్తు ఫీజు రూ.200. ఇది ఇలా ఉంటే సెలెక్ట్ అయినా వాళ్లకి వేతనం రూ.1,77,500 వరకు ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను www.jointerritorialarmy.gov.in వెబ్‌సైట్‌ లో తెలుసుకోవచ్చు.

JOBS : ఏపీలో 1184 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ : ఏపీపీఎస్సీ

Read more RELATED
Recommended to you

Exit mobile version