ఇంటి పనులు చేయని మగవారు ఎక్కువ సంపాదిస్తార‌ట‌

-

ఇంట్లో భార్య భ‌ర్త‌లు క‌లిసి ఒక‌రికొక‌రు స‌హాయ‌ప‌డుతూ ప‌నులు చేసుకుంటూ ఉంటారు. అలాంటి భ‌ర్త దొర‌క‌డం అదృష్టంగా భావిస్తుంటారు మ‌హిళ‌లు. అయితే తాజా స్టడీ ప్రకారం కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. వాటి వివరాల్లోకి వెళితే పురుషులు ఎవరైతే ఇంటి పనులు చేయరో వాళ్లు ఎక్కువగా సంపాదిస్తార‌ని దాని సారాంశం.

ఎదుటి వారు ఇచ్చే స‌ల‌హాల‌ను పాటించే వారికంటే కూడా స్వ‌తంత్రంగా ఆలోచించ‌గ‌లిగేవారు సంపాద‌న‌లో ముందుంటార‌ట‌. ఎక్కువ ఇతరుల సలహాలకి అంగీకరించే వారితో పోల్చుకుంటే వీళ్లు ఎక్కువగా సంపాదిస్తారు.

ఇంట్లో మ‌గ‌వారు వారి వారి ప‌నిచేసుకోవ‌డం వ‌ల్ల ఇంటి ప‌నులు చేయ‌టం వీలుకాదు. అలాంట‌ప్పుడు వారి భార్యలు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. ఎవరైతే ఇంటి పనులు చేస్తారో వాళ్లు ఆఫీస్ పని మరియు ఇంటి పనులు రెండు చెయ్య‌డం వ‌ల్ల ఆఫీసుప‌ని లేదా బిజినెస్‌కు స‌మ‌యం ఎక్కువ‌గా కేటాయించ‌లేరు.

అదే ఇంటి పనుల్లో భాగం పంచుకోని వాళ్ళు వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని మరింత ఎక్కువగా ఆఫీసు మరియు ఇతర ఇన్వెస్ట్మెంట్ మీద పెడతారు కనుక ఎక్కువ సంపాదిస్తారు. అలానే ఎవరైతే ఎక్కువ ఇంటి పనులు చేస్తారో వాళ్ళు ఆఫీసు ప‌నికి ఎక్కువ స‌మ‌యం కేటాయించ‌లేరు. ఆవిధంగా వారు వెన‌క‌ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌.

ఇలా ఇంటి ప‌నులు చేస్తూ, ఆఫీసు ప‌నులు పెండింగ్ పెట్ట‌డం లేదా ప్రొడ‌క్టివిటీ త‌గ్గ‌టం వ‌ల‌న ఆఫీసులో కాస్త వీరిపై నెగటివిటీ ఉంటుంది. ఇంకా ఇంట్లో ప‌నులు చేస్తూ త‌రువాత చెయ్య‌క‌పోవ‌డం వ‌ల‌న భార్య భ‌ర్త‌ల మ‌ద్య గొడ‌వ‌లు రావ‌డం జ‌ర‌గ‌వ‌చ్చు. అలాంటి సంద‌ర్భంలో మెంట‌ల్ టెన్స‌న్ వ‌ల‌న ఆఫీసులో పూర్తి స్థాయిలో పని చెయ్య‌క‌పోవ‌డం కూడా జ‌రుగుతుంది.

ఇంటి వద్ద ఉన్న బాధ్యతల భారాన్ని తేలికగా ఉంటే వర్క్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది అని ఈ సర్వేలో తేలింది. మంచి భ‌ర్త‌లా ఉండ‌టం మంచిదే సంపాద‌న కూడా అంతే ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Exit mobile version