భారత్‌లో రోజూ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరో షాకింగ్ విషయాన్ని తెలియజేసింది. భారత్‌కు చెందిన అత్యంత శక్తివంతమైన డబుల్ మ్యుటంట్ వేరియెంట్ (బి.1.617)ను 44 దేశాల్లో గుర్తించినట్లు WHO తెలియజేసింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది.
భారత్‌లో ఈ వేరియెంట్ వల్లే కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇప్పుడు ఇదే వేరియెంట్ ను 44 దేశాల్లో గుర్తించామని WHO తెలియజేయడం ఆందోళన కలిగిస్తోంది. పలు దేశాల్లో ఉన్న WHO అనుబంధ సంస్థల ద్వారా సమాచారాన్ని సేకరించిన WHO ఈ విషయాన్ని వెల్లడించింది.
గత ఏడాది అక్టోబర్‌లో భారతదేశంలో మొట్టమొదటగా కోవిడ్ -19 కు చెందిన బి.1.617 వేరియంట్ ను గుర్తించారు. తాజాగా GISAID ఓపెన్-యాక్సెస్ డేటాబేస్‌లో అప్‌లోడ్ చేసిన జన్యు శ్రేణులలో మొత్తం ఆరు WHO సంస్థల ద్వారా 44 దేశాలలో ఈ వేరియెంట్‌ను గుర్తించామని ఆ సంస్థ పేర్కొంది. కాగా ఇప్పటికే బ్రిటిష్, బ్రెజిల్, సౌతాఫ్రికా వేరియెంట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుండగా వాటి సరసన భారత్‌కు చెందిన వేరియెంట్‌ను ఆ జాబితాలో చేర్చారు. కరోనా వైరస్ మొదటి స్ట్రెయిన్‌ల కన్నా ఈ కొత్త వేరియెంట్లు మరింత ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని, చికిత్సకు మరింత నిరోధకతను కలిగి ఉన్నాయని WHO తెలియజేసింది. ఈ క్రమంలోనే ఈ కోవిడ్ వేరియెంట్ల పట్ల ప్రపంచంలోని ఇతర దేశాలు జాగ్రత్తగా ఉండాలని WHO హెచ్చరించింది.