గుడ్ న్యూస్: ఆ బ్యాంక్ కొత్త స్కీమ్… కొద్ది రోజులే అవకాశం..!

-

బ్యాంకులు ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వస్తూ ఉంటాయి. తాజాగా ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ బ్యాంకు స్పెషల్ స్కీమ్‌ను తీసుకు రావడం జరిగింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రొడక్టును ఇండియన్ బ్యాంకు తీసుకొచ్చింది. ఇది కేవలం లిమిటెడ్ పిరియడ్‌లో మాత్రమే. “IND UTSAV 610″పేరుతో ఈ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్‌ను తీసుకు రావడం జరిగింది.

ఈ స్కీమ్ టెన్యూర్ 610 రోజులు. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ స్కీమ్‌పై బ్యాంకు 6.10 శాతం వడ్డీని ఇస్తోంది. 6.25 శాతం సీనియర్ సిటిజన్లకి.. 80 ఏళ్లు పైబడని సూపర్ సీనియర్ సిటిజన్లకు 6.5 శాతం వడ్డీ ఇస్తోంది. తుది గడువు అక్టోబర్ 31, 2022తో ముగుస్తుంది కనుక దీనిని ఈలోగా వినియోగించుకుంటే మంచిది. INDOASIS app ద్వారా ఈ ప్లాం ని పొందొచ్చు.

ఇంట్లో వుండే స్వయంగా దీనిని పొందొచ్చు. గత నెల 24వ తేదీన వడ్డీ రేట్లను చివరగా మార్చింది. ఆ వడ్డీ రేట్లను చూస్తే.. ఏడు రోజుల నుండి ఐదేళ్లకు 2.80 శాతం నుంచి 5.65 శాతం మధ్యలో వడ్డీ రేట్లను ఇస్తోంది. మూడేళ్లు లేదా ఐదేళ్ల కంటే తక్కువ సమయంలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై నాన్ సీనియర్ సిటిజన్లకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news