ఇండియా ఫాస్ట్ బౌలర్ ధవల్ కులకర్ణి ఫస్ట్ క్లాస్ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తోన్న కులకర్ణి రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భపై గెలిచిన తర్వాత ఎమోషనల్ అయ్యారు.కులకర్ణి 2008లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు.కులకర్ణి 96 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 281 వికెట్లు ,12 వన్డేల్లో 19 వికెట్లు, ఐపీఎల్ లో 86 వికెట్లు తీశారు. ముంబైని రంజీ ట్రోఫీ విజేతగా నిలిపిన అతడు ఫస్ట్ క్లాస్ కెరీర్‌కు గుడ్ బై ప్రకటించాడు.
ఈ సందర్భంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన మాజీ సహచరుడైన కులకర్ణిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ స్టార్ పేసర్‌ను ఉద్దేశిస్తూ.. ‘ముంబై యోధుడు. నీ కెరీర్ అద్భుతంగా సాగినందుకు అభినందనలు’ అని రోహిత్ శర్మ కామెంట్ చేశాడు. రోహిత్, కులకర్ణిలు గతంలో ముంబై ఇండియన్స్‌కు కలిసి ఆడారు.వాంఖడే స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో పేసర్ కులకర్ణి సూపర్ స్పెల్‌తో ముంబై విజయంలో కీలక పాత్ర వహించాడు. ఆరు వికెట్లతో విదర్భ పతనాన్ని శాసించాడు.