లడక్ ప్రాంతంలో దేశ సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేయకుండా భారత దళాలను ప్రపంచంలో ఏ శక్తులు ఆపలేవని భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ గురువారం అన్నారు. సరిహద్దు భద్రత పై రాజనాథ్ సింగ్ ప్రకటన చేశారు. రాజ్యసభలో ఎంపీలు వివరణలకు ఆయన సమాధానమిచ్చారు. గత కొన్ని నెలలుగా చైనాతో వాగ్వాదం ఉందని ముఖాముఖి ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతుందని చెప్పారు.
దీనితో పెట్రోలింగ్ కాస్త సమస్యగా ఉందని ఆయన అన్నారు. నేను స్పష్టంగా చెప్తాను ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పెట్రోలింగ్ అనేది సరిహద్దుల్లో కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. సరిహద్దుల్లో బలగాలను భారీగా మోహరిస్తున్నారు అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గత కొంతకాలంగా భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.