చైనా ఆక్రమించుకుంది.. పార్లమెంట్ లో రాజ్ నాథ్ ప్రకటన..!

-

భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య ఎత్తులు పైఎత్తులు కొనసాగుతూనే ఉన్నాయి. రోజురోజుకు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే ఇటీవలే ప్రారంభమైన వర్షాకాలం పార్లమెంట్ సమావేశాల్లో కూడా సరిహద్దుల్లో ఘర్షణ హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనిపై ప్రతిపక్షాలు అధికారపక్షం మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతూనే ఉన్నాయి.

అయితే నేడు రాజ్యసభ వేదికగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. 1962 యుద్ధం తర్వాత లడక్ లో చైనా 38 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుంది అన్న విషయాన్ని ఇటీవల రాజ్య సభ వేదికగా తెలిపారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. అంతేకాకుండా ఇప్పటికికూడా అరుణాచల్ ప్రదేశ్లోని వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా తమదే అంటూ వాధిస్తుందని తెలిపిన రాజ్ నాథ్ సింగ్… 2003 వరకు ఇరు దేశాల మధ్య సరిహద్దు ఒప్పందాలు జరిగాయి అని గుర్తు చేశారు. ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరికాదని.. సరిహద్దుల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా ఉపేక్షించేది లేదు అంటూ తెలిపారు రాజ్ నాథ్ సింగ్.

Read more RELATED
Recommended to you

Latest news