క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన కేంద్రం ప్ర‌భుత్వం..

-

యూఏఈ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ 13 ఎడిష‌న్‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు కేంద్రం బీసీసీఐకి అనుమ‌తులు ఇచ్చింది. సెప్టెంబ‌ర్ 19వ తేదీ నుంచి న‌వంబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు ఐపీఎల్ 2020 జ‌ర‌గ‌నుంది. కాగా ఐపీఎల్‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో బీసీసీఐ ఊపిరి పీల్చుకుంది. ఇప్ప‌టికే ఐపీఎల్ టోర్నీకి గాను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు నుంచి బీసీసీఐ అనుమ‌తి తీసుకుంది. ఇప్పుడు కేంద్రం కూడా అనుమ‌తి ఇవ్వ‌డంతో ఐపీఎల్ టోర్నీ నిర్వ‌హ‌ణ‌కు మార్గం సుగ‌మ‌మం అయింది.

కాగా ఐపీఎల్ టోర్నీని దుబాయ్‌లో నిర్వ‌హించేందుకు కావ‌ల్సిన అనుమ‌తికి గాను బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ఎంతో ప్ర‌య‌త్నించారు. ఎట్ట‌కేల‌కు ఆయ‌న కృషి ఫ‌లించింది. ఈ క్ర‌మంలో బీసీసీఐ ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌నుంది.

అయితే గ‌తంలో 2009లో సౌతాఫ్రికాలో ఒక‌సారి ఐపీఎల్ జ‌ర‌గ్గా, మ‌రోసారి 2014లో యూఏఈలో పాక్షికంగా ఐపీఎల్ జ‌రిగింది. ఇత‌ర దేశాల‌కు చెందిన ప్లేయ‌ర్ల‌కు దుబాయ్ అయితేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని భావించిన బీసీసీఐ అక్క‌డే టోర్నీని నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version