కరోనా కలవరపెట్టినా.. మోగింది పెండ్లికి బాజా

-

 

పెండ్లి అంటే సాధారణంగా పెండ్లిపిల్ల, పెండ్లి కొడుకు ఇద్దరి బంధుమిత్రుల సమక్షంలో అంగరంగవైభవంగా జరుగుతుంది. పశ్చిమబెంగాల్లో ఒక పెండ్లి కూడా అంగరంగవైభవంగానే జరిగింది. కానీ ఆ పెండ్లిలో పెండ్లి కొడుకు బంధుమిత్రుల సందడి మాత్రమే కనిపించింది. పెండ్లి కూతురు తరఫున ఆమె తప్ప మరొక్కరు కూడా ఆ పెండ్లిలో లేరు. అలాగని ఆమె అనాధ అనుకుంటే పొరపాటే. ఆమెకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరూ ఉన్నారు. మరెందుకు పెండ్లికి రాలేదనేగా మీ అనుమానం? అయితే ఈ వార్త చదవండి..

పశ్చిమబెంగాల్లోని ఈస్ట్‌ మిడ్నాపూర్‌కు చెందిన పింటు అనే అబ్బాయి, చైనాకు చెందిన అమ్మాయి జియాకీ గత ఏడేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఉద్యోగరీత్యా చైనాకు వెళ్లిన పింటుతో జియాకీకి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇద్దరి ఇండ్లలో పెద్దలు వారి ప్రేమకు అంగీకారం తెలుపడంతో.. ఫిబ్రవరి 5న మిడ్నాపూర్‌లో పెండ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. పెండ్లి కూతురు భారత్‌లోనే ఉంటుండగా.. ఆమె తల్లిదండ్రులు మాత్రం చైనా నుంచి రావాల్సి ఉండె. అయితే చైనాలో కరోనా వైరస్‌ విజృంభించిన కారణంగా భారత్‌, చైనా మధ్య విమనాల రాకపోకలు రద్దయ్యాయి. దీంతో పెండ్లి కూతురు తల్లిదండ్రులుగానీ, బంధుమిత్రులుగానీ మన దేశానికి రాలేకపోయారు. అయినా కూడా పెండ్లి కొడుకు తల్లిదండ్రులు.. పెండ్లి కూతరు తల్లిదండ్రుల అంగీకారం తీసుకుని అనుకున్న మూహూర్తానికి పెండ్లి తంతు కానిచ్చారు.

‘కరోనా వైరస్‌ కారణంగా నా తల్లిదండ్రులు పెండ్లికి రాలేకపోయారు. చైనాలో పరిస్థితులు చక్కబడిన తర్వాత మేము అక్కడికి వెళ్తాం’ అని పెండ్లి కూతరు జియాకీ చెప్పిగా, ‘మా పెండ్లి చైనా, బెంగాళీ సంప్రదాయ పద్ధతుల్లో జరిగింది. చైనాకు వెళ్లిన తర్వాత మా అత్తగారి ఇంటిదగ్గర మరో ఫంక్షన్‌ చేసుకుంటాం’ అని పెండ్లి కొడుకు పింటు చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version