భారత నగల వ్యాపారి గిన్నిస్ వరల్డ్ రికార్డు లో చోటు సంపాదించుకున్నాడు. అయితే ఈ నగల వ్యాపారి ఈ రికార్డుని సొంతం చేసుకున్నాడు అంటే కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నారా…? మరి ఇప్పుడే తెలుసుకోండి. ఈ నగల వ్యాపారి ఒకే ఉంగరంలో 12,368 వజ్రాలను పెట్టడం జరిగింది. ఎంత గొప్ప విషయంలో కదా…! దీని మూలం గానే గిన్నిస్ వరల్డ్ రికార్డు లో స్థానం దక్కింది.
వివరాల్లోకి వెళితే… మీరట్ లోని రెనానీ జ్యువెలరీ వ్యవస్థాపకులు హార్షిత్ బన్సాల్ ఈ రికార్డును నెలకొల్పారు. ఇతను 2018 నుంచి జ్యువెలరీ డిజైన్ నేర్చుకోవడం జరిగింది. అప్పటి నుండి ఉంగరంలో వేలాది వజ్రాలను పొందుపరిచేందుకు ప్రయత్నించాడు. అయితే ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మొత్తం 12,638 నేచురల్ వజ్రాలను ఒకే ఉంగరంలో పెట్టి అద్భుతమైన డిజైన్ ఒకటి రూపొందించారు. ఎన్నో ఏళ్లుగా పడిన శ్రమకు గిన్నిస్ ప్రపంచ రికార్డులో గుర్తింపు లభించడంతో బన్సాల్ ఆనందానికి అవధులు లేవు.
అచ్చం మ్యారీ గోల్డ్ పువ్వు మాదిరిగా వజ్రాలతో కూడిన రింగును తయారు చేశారు. ‘Marigold-Ring of Prosperity’ ఆ ఉంగరం పేరు. తన లక్ష్యం ఎప్పుడూ 10వేల వజ్రాల పైనే అని చెప్పడం జరిగింది. గతంలో గిన్నిస్ ప్రపంచ రికార్డు లో హల్ మార్క్ జ్యువెలురీ పై ఉండేది. అయితే ఆ రికార్డులో 7,801 వజ్రాలను ఒకే రింగులో పెట్టి రికార్డు నెలకొల్పింది. కానీ ఇప్పుడు రెనానీ జ్యువెలరీ రికార్డుని బ్రేక్ చేసింది.