యూట్యూబ్‌ CEOగా భారతీయుడు నీల్ మోహన్

-

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్​ఫామ్ యూట్యూబ్​కు కొత్త సీఈవో నియామకమయ్యయారు. అతడెవరో కాదు మన భారతీయుడే. నీల్ మోహన్ యూట్యూబ్ నూతన సీఈవోగా నియమితులయ్యారు. సుదీర్ఘ కాలంగా సీఈవోగా ఉన్న సూసన్‌ వొజిసికి పదవి నుంచి వైదొలగడంతో యూట్యూబ్‌ యాజమాన్యం ఇండో-అమెరికన్‌ అయిన నీల్‌ మోహన్‌ను కొత్త సీఈవోగా నియమించింది.

ప్రస్తుతం నీల్‌ మోహన్‌ యూట్యూబ్‌లో చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇక కొత్తగా సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నీల్‌మోహన్‌కు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అభినందనలు తెలిపారు. సుసాన్‌ వొజిసికి సేవలను కొనియాడారు. సూసన్‌ అసాధారణ టీమ్‌ను సిద్ధం చేశారని పేర్కొన్నారు. యూట్యూబ్‌ను ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించాలని తన ప్రకటనలో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు.

ఇక ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ కంపెనీల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖ సెర్చ్ ఇంజిన్‌ గూగుల్‌ సీఈవోగా సుందర్‌ పిచాయ్‌, మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా సత్య నాదేళ్ల, అడోబ్‌ సీఈవోగా శంతను నారాయణ్‌ ఉన్నారు. మరో భారతీయుడు పరాగ్‌ అగర్వాల్‌ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌కు సీఈవోగా పనిచేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version