బ్రేకింగ్; 168 రైళ్ళు రద్దు…!

-

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న నేపధ్యంలో పలు విమాన సర్వీసులతో పాటు, రైలు, బస్ సర్వీసులను కూడా రద్దు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావడం లేదు. దీనితో పలు ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను కూడా రద్దు చేసారు. పలు విమాన సర్వీసులు ఇప్పటికే రద్దు అయ్యాయి. రైల్వేశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

దేశంలో మార్చి 20వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు 168 రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా 99 రైళ్లను రద్దు చేసింది. ఇప్పటికే రద్దు చేసిన రైళ్లలో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు ఫోన్ సందేశాల ద్వారా సమాచారం చేరవేస్తామని ఇండియన్ రైల్వే మీడియాకు తెలిపింది. దక్షిణ మధ్య రైల్వేలో 20 రైళ్లు, నార్తన్ సెంట్రల్ రైల్వేలో 11,

నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేలో 20, సదరన్ రైల్వేలో 32, ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 5 రైళ్లను రద్దు చేశారు అధికారులు. కరోనా వైరస్ లక్షణాలుగా భావిస్తున్న దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారు రైల్వే కేటరింగ్ పనులు చేయకుండా చూడాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. రైళ్ళలో విదేశీయులను ప్రయాణం చేయనీయకుండా చూడాలని అధికారులు ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version