స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తున్న రైల్వే శాఖ..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా వెస్టర్న్ రైల్వే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. స్పోర్ట్స్ Sports కోటాలో గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దీనిలో మొత్తం 21 పోస్టుల్ని ప్రకటించింది.

Indian Railway Job recruitment

ఈ క్రీడల్లో రాణించినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. మొత్తం ఖాళీలు 21. అథ్లెటిక్స్- 7, హ్యాండ్ బాల్- 3, హాకీ- 3, బాస్కెట్ బాల్- 3,
క్రికెట్- 1, డైవింగ్- 1, రెజ్లింగ్- 1, వాటర్ పోలో- 1, టేబుల్ టెన్నిస్- 1. విద్యార్హతలు చూస్తే.. విద్యార్హతలు- లెవెల్ 4, లెవెల్ 5 ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. లెవెల్ 2, లెవెల్ 3 పోస్టులకు 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి.

అలానే అభ్యర్థులు 2019 ఏప్రిల్ 1 నుంచి 2021 జూలై 28 మధ్య సంబంధిత క్రీడల్లో రాణించి ఉండాలి.ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేసే పోస్టులు కాబట్టి ఆయా క్రీడల్లో రాణించిన వారే అప్లై చేయాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 ఆగస్ట్ 4న ప్రారంభం అవుతుంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 3 చివరి తేదీ.

వయస్సు 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. అంటే 1997 జనవరి 2 నుంచి 2004 జనవరి 1 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ఫీజు- రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్, మహిళలకు రూ.250. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.rrc-wr.com/ వెబ్‌సైట్‌లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version