ఇండియన్ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సరుకు రవాణాకు సంబంధించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటూ గూడ్స్ ట్రైన్స్‌కు కూడా ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీని పేరు ఫ్రైట్ బిజినెస్ డెవలప్‌మెంట్ పోర్టల్. ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్ మాదిరిగానే ఇండియన్ రైల్వేస్ ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రస్తుతం 84 లొకేషన్ లలో ఈ సదుపాయం కల్పించగా సెకండ్ ఫేజ్ లో 143, థర్డ్ ఫేజ్ లో 523 లొకేషన్ లకు విస్తరింకానున్నారు. ఈ సర్వీసు ప్రకారం ఎవరైనా లగేజ్ లేదా సరుకు రవాణాకు సంబంధించి బుకింగ్ సెంటర్‌కు వెళ్లాల్సిన పని లేదు. అలాగే డెలివరీ టైమ్, సరుకు ఎక్కడ ఉంది ఇలా అన్ని విషయాలను ఆన్‌లైన్ లోనే తెలుసుకోవచ్చు. https://indianrailways.gov.in పోర్టల్ ద్వారా మీరు గూడ్స్‌ను నేరుగా రైల్వే స్టేషన్‌కు అక్కడి నుంచి ఎక్కడికైనా చేరవేయొచ్చు.