రాలిపోతున్న జుట్టు మరలా పెరిగేందుకు ఏం చేయాలో తెలుసుకోండి.

-

జుట్టు రాలిపోవడం ఇప్పుడు పెద్ద సమస్య కాదు. ప్రతీ ఒక్కరూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇంకా, దాన్నుండి కాపాడుకోవడానికి కొందరు రకరకాల రసాయనాలు వాడుతుంటే మరికొందరు సహజ సిద్ధంగా ఉండే వాటిని ప్రయోగిస్తున్నారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. రోజుకి ఒక వంద వెంట్రుకల వరకు సహజంగా రాలిపోతూనే ఉంటాయి. అలా రాలిపోయిన స్థానంలో మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాయి. అందుకని ఏ చిన్న వెంట్రుక రాలినట్టు కనిపించినా పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదని తెలుసుకోవాలి.

ఐతే మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో జుట్టు పెరుగుదలని ఎలా పెంచుకోవచ్చో చూద్దాం.

ఉల్లిపాయ రసం

ఇది చాలా పురాతనమైన ప్రక్రియ. ఉల్లిపాయలో ఉండే పోషకాలు, ముఖ్యంగా దాన్లోని సఫర్ కణజాలల్లో కొల్లాజెన్ ని ఉత్పత్తి చేసి జుట్టుని బాగా పెరిగేలా చేస్తుంది. ఈ రసం వాసన కొంత ఇబ్బంది పెట్టేదిగా ఉన్నప్పటికీ జుట్టు పెరగాలని అనుకునేవారు దాన్ని పట్టించుకోకుండా ఉంటే బెటర్.

ఉల్లిపాయ రసాన్ని ఎలా వాడాలి?

ముందుగా కొన్ని ఉల్లిపాయలని తీసుకుని ముక్కలుగా తరిగి, అందులో నుండి రసాన్ని బయటకి తీయాలి. దీనికోసం ముక్కలని గ్రైండర్ లో వేసినా సరిపోతుంది. అప్పుడు వచ్చిన ఆ రసాన్ని నెత్తిమీద పెట్టుకోవాలి. ఒక 10-20నిమిషాలయ్యాక నీటితో శుభ్రంగా కడిగేసుకుంటే సరిపోతుంది. షాంపూతో కడుక్కున్నా మంచిదే. ఉల్లిపాయ స్థానంలో ఆలుగడ్డని వాడినా ఫలితం బాగానే ఉంటుంది. అచ్చం ఉల్లిపాయ రసం తీసినట్టుగానే బంగాళ దుంప రసం తీసి జుట్టుకి పట్టించుకున్నా బాగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news